English | Telugu
సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు
Updated : May 10, 2011
సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించబోతున్నాడని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించబోయే చిత్రానికి లెక్కల పంతులు సుకుమార్ దర్శకత్వం వహించనున్నారని బలంగా వినపడుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై, నాగచైతన్య హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్ గానటించగా, సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన "100%లవ్" సినిమా సూపర్ హిట్టవటంతో సుకుమార్ కి మళ్ళీ మహర్దశ పట్టింది.
ఈ సినిమా ప్రభావం వలన ప్రిన్స్ మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్టు ఒక క్యూట్ లవ్ స్టోరీని తయారు చేయాల్సిందిగా ఒక ప్రముఖ నిర్మాత సుకుమార్ ని ఆదేశించారట. దానికి తగ్గట్టుగానే మహేష్ బాబు కూడా ఈ సినిమాలో నటించటానికి తన అంగీకారాన్ని తెలిపినట్లు సమాచారం. ఈ పని మీద సుకుమార్ కి కోటి రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చారట ఆ సదరు నిర్మాత. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో, మహేష్ బాబు "దూకుడు" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తికాగానే సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించే సినిమా ప్రారంభమవుతుందని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు.