English | Telugu
మహేష్ నాగార్జున మణిరత్నం... ఒక ఐష్
Updated : Mar 13, 2014
మహేష్, నాగార్జున ప్రధాన పాత్రలలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కబోతుందని గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్ర షూటింగ్ జూలైలో మొదలవుతుందని సమాచారం. ఇందులో ఐశ్వర్యరాయ్ ముఖ్య పాత్రలో నటించబోతుందట. ఈ చిత్రానికి రవివర్మన్ సినిమాటోగ్రఫీ, ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథ మణిరత్నం సిద్ధం చేసారట. ఇప్పటికే హైదరాబాదులోని పలు అందమైన లొకేషన్లను కూడా మణిరత్నం ఖరారు చేసారట. మరి ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.