English | Telugu

మహేష్ బాబు హీరోగా క్రిష్ సినిమా

మహేష్ బాబు హీరోగా క్రిష్ సినిమా ఉంటుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే అల్లరి నరేష్ ‍, శర్వానంద్, కమలినీ ముఖర్జీ ప్రథానతారాగణంగా వచ్చిన "గమ్యం" వంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన క్రిష్ ఆ తర్వాత మంచు మనోజ్, అల్లు అర్జున్ హీరోలుగా, అనుష్క, దీక్ష సేథ్ హీరోయిన్లుగా "వేదం" అనే మరో విభిన్నకథాంశంతో ఉన్న సినిమాని తీశాడు క్రిష్. "వేదం" సినిమాని తమిళంలో "వానమ్" పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమాకి కూడా క్రిష్ దర్శకత్వం వహించటం విశేషం.

అలాంటి క్రిష్ ఈ మధ్య ప్రముఖ హీరో ప్రిన్స్ మహేష్ బాబుకి ఒక చక్కని కథను వినిపించారట. ఆ కథ నచ్చటంతో మహేష్ బాబు ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం మహేష్ బాబు 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, శ్రీనువైట్ల దర్శకత్వంలో, సమంత హీరోయిన్ గా నటిస్తున్న "దూకుడు" సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇలియానా హీరోయిన్ గా నటించబోయే "ది బిజినెస్ మేన్" చిత్రంలో హీరోగా నటించాక క్రిష్ దర్శకత్వంలోని సినిమాలో మహేష్ బాబు నటిస్తారని సమాచారం.