English | Telugu
'సర్కారు వారి పాట'లో విలన్ గా సముద్రఖని!!
Updated : Jul 9, 2021
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు సీనియర్ నటుడు అర్జున్ ఈ మూవీలో నెగిటివ్ రోల్‌లో నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక తాజాగా మరో నటుడు పేరు తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం 'సర్కారు వారి పాట'లో సముద్రఖని విలన్ గా నటించనున్నారని తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' మూవీలో సముద్రఖని విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన 'క్రాక్' మూవీలోనూ విలన్ గా నటించి మెప్పించారు. ఇప్పుడు 'సర్కారు వారి పాట'లో కూడా విలన్ గా సముద్రఖని ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.
బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో మహేష్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.