English | Telugu

ఎన్టీఆర్ భార్య గర్భవతి.. నిజమేనా?

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నరనే వార్త గతకొన్ని రోజులుగా వినిపిస్తుంది. కానీ ఇవన్నీ పుకార్లే అంటూ కొట్టిపారేశారు. కానీ ఈ పుకార్లన్ని నిజమేనని తేలింది.

బుధవారం జరిగిన జూబ్లిహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో తన భార్య లక్ష్మీప్రణతి, తల్లి శాలినితో కలిసి ఎన్టీఆర్ ఓటు వేయడానికి వచ్చాడు. అయితే ఓటు వేయడానికి క్యూలో నిలబడిన లక్ష్మీ ఎక్కువసేపు నిలబడలేక అవస్థలు పడుతుండటంతో త్వరగా ఓటు వేసే అవకాశం ఇవ్వమని ఎన్టీఆర్ పోలింగ్ సిబ్బందిని కోరడంతో ఎన్టీఆర్ కుటుంబానికి అనుమతి ఇచ్చారు. కానీ తన భార్య గర్భవతి అని ఇప్పటివరకు ఎన్టీఆర్ ఎప్పుడు నోరు విప్పలేదు. కానీ ఈ సంఘటనతో లక్ష్మీ ప్రణతి గర్భవతి అని నిర్ధారణ అయినట్లే. ఈ వార్త ఎన్టీఆర్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్ నటిస్తున్న "రభస" చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.