English | Telugu

మంచు లక్ష్మీ చేతిలో రజినీకాంత్

 

రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "విక్రమ సింహ". తమిళంలో "కొచ్చడయన్". ఈ చిత్ర తెలుగు హక్కులను మంచు లక్ష్మీ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాల్లో లక్ష్మీ పాల్గొనబోతుంది. దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి రజినీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించింది. 3D పిక్చర్ కాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకునే, శోభన, శరత్ కుమార్, నాజర్, ఆది, జాకీష్రాఫ్, రుక్మిణి విజయ్ కుమార్ వంటి తారాగణం ప్రధాన పాత్రలలో నటించారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని మే 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.