English | Telugu

ధ‌నుష్‌తో 'ఉప్పెన' హీరోయిన్‌?

'ఉప్పెన‌'తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది కృతి శెట్టి. బేబ‌మ్మ పాత్ర‌లో ఒదిగిపోయి.. తెలుగు కుర్ర‌కారుని ఫిదా చేసేసింది. మొద‌టి సినిమాతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ హీరోయిన్ అనిపించుకుంది. క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.అందులో ఒక‌టి నేచుర‌ల్ స్టార్ నాని టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' కాగా.. మ‌రొక‌టి సుధీర్ బాబుతో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కిస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇంకొక‌టి.. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కోలీవుడ్ కెప్టెన్ లింగుస్వామి తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందించ‌నున్న బైలింగ్వ‌ల్ మూవీ.

ఈ మూడు సినిమాలతో బిజీగా ఉంటూనే.. తాజాగా త‌మిళంలో ఓ భారీ బ‌డ్జెట్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట కృతి. ఆ వివ‌రాల్లోకి వెళితే.. 'మారి', 'మారి 2' త‌రువాత కోలీవుడ్ స్టార్ ధ‌నుష్, యంగ్ డైరెక్ట‌ర్ బాలాజీ మోహ‌న్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రానుంది. ఇందులో నాయిక పాత్ర‌లో కృతి శెట్టిని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్.

త్వ‌ర‌లోనే ధ‌నుష్ - బాలాజీ కాంబో మూవీలో కృతి ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది.