English | Telugu

సోనూ సూద్‌తో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్?

'జ‌న‌గ‌ణ‌మ‌న'.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఎప్ప‌టినుండో 'ఇస్మార్ట్' డైరెక్ట‌ర్ చేయాల‌నుకుంటున్న సందేశాత్మ‌క దేశ‌భ‌క్తి సినిమా ఇది. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో తీద్దామ‌నుకున్న‌ప్ప‌టికీ.. ఎందుక‌నో వ‌ర్క‌వుట్ కాలేదు. ఆపై ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనూ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. అవి కాస్త‌.. ప్ర‌చారానికే ప‌రిమిత‌మ‌య్యాయి.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఎట్ట‌కేల‌కు పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌బోతోంద‌ట‌. అయితే.. సూప‌ర్ స్టార్‌నో.. ప‌వ‌ర్ స్టార్‌నో ఇందులో న‌టించ‌డం లేదు. గ‌తేడాది క‌రోనా క‌ష్ట‌కాలంలో 'రియ‌ల్ హీరో' అనిపించుకున్న 'రీల్ విల‌న్' సోనూ సూద్ ఇందులో న‌టించ‌బోతున్నార‌ట‌. పూరి తెర‌కెక్కించిన 'సూప‌ర్', 'ఏక్ నిరంజ‌న్' సినిమాల్లో నెగ‌టివ్ రోల్స్ చేసిన సోనూ సూద్.. ఇప్పుడు ప‌వ‌ర్‌ఫుల్ పాజిటివ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. త‌న‌ క‌థ‌కు సోనూ సూద్ 'రియ‌ల్ హీరో' ఇమేజ్ తోడైతే.. 'జ‌న‌గ‌ణ‌మ‌న'` నెక్స్ట్ లెవ‌ల్‌కి వెళ్ళ‌డం ఖాయ‌మ‌నే ఉద్దేశంతో ఇటీవ‌ల సంప్ర‌దింపులు జ‌రిపార‌ట‌ పూరి.

అది వాస్త‌వ‌రూపం దాలిస్తే.. పూరి, సోనూ కాంబినేష‌న్ లో రానున్న 'జ‌న‌గ‌ణ‌మ‌న‌' ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. పూరి తాజా చిత్రం 'లైగ‌ర్' సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కానుంది. ఇక సోనూ సూద్ చేతిలో 'ఆచార్య‌', 'పృథ్వీరాజ్' (హిందీ), 'త‌మిళ‌ర‌స‌న్' (త‌మిళ్) చిత్రాలున్నాయి.