English | Telugu
`బంగార్రాజు`లో కృతి శెట్టి?
Updated : Jul 7, 2021
`ఉప్పెన`తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు ఆసక్తికరమైన చిత్రాలున్నాయి. నేచురల్ స్టార్ నానికి జంటగా నటిస్తున్న `శ్యామ్ సింగ రాయ్`.. టాలెంటెడ్ హీరో సుధీర్ బాబుకి జోడీగా యాక్ట్ చేస్తున్న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రీకరణ దశలో ఉండగా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన నటించనున్న బైలింగ్వల్ మూవీ జూలై 12 నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించేందుకు కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. 2016 నాటి సంక్రాంతి బ్లాక్ బస్టర్ `సోగ్గాడే చిన్ని నాయనా`కి సీక్వెల్ గా `బంగార్రాజు` రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో కింగ్ నాగార్జునకి జంటగా రమ్యకృష్ణతో పాటు మరో స్టార్ హీరోయిన్ కనిపించనుంది. కాగా, మరో హీరోగా నటించనున్న యువ సామ్రాట్ నాగచైతన్యకి జంటగా కృతి శెట్టిని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. పాత్ర నిడివి చిన్నదే కావడంతో.. కృతి కాల్షీట్స్ పెద్ద సమస్య కాకపోవచ్చని వినిపిస్తోంది. త్వరలోనే `బంగార్రాజు`లో కృతి ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. ఈ సీక్వెల్ కృతి కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.