English | Telugu
మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో కృతిశెట్టి!!
Updated : Jul 8, 2021
'ఉప్పెన' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు ఆకట్టుకుంది. వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే నానికి జోడిగా 'శ్యామ్ సింగ రాయ్', సుధీర్ బాబుకు జోడిగా 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి' సినిమాలలో నటిస్తోంది. అలాగే రామ్ పోతినేని- డైరెక్టర్ లింగుసామి కాంబినేషన్లో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్టైనర్ లో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది. ఇలా వరుస ఆఫర్స్ పట్టేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఎడిటల్ ఎస్ఆర్ శేఖర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. హీరో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో నితిన్ కు జోడిగా కృతిశెట్టి నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే నాగ చైతన్య సరసన కూడా ఓ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ చైతన్య, అఖిల్ కూడా నటించబోతుండగా.. చైతూ సరసన నటించే ఛాన్స్ కృతికి వచ్చినట్టు సమాచారం.
మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయి.. వరుస సినిమాలతో బిజీ అయిన కృతిశెట్టి.. ముందు ముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.