English | Telugu

వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ!!

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న వరుణ్.. త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడని తెలుస్తోంది.

వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ హిందీలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందట. ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ఈ సినిమాకి పనిచేయనున్నారని.. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటికే వరుణ్ తో సంప్రదింపులు జరిగాయని అంటున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నట్లు సమాచారం.

వరుణ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'F3', కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' చిత్రాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత హిందీ మూవీ చేస్తాడని తెలుస్తోంది.