English | Telugu

ఎన్టీఆర్ కి కథ చెప్పిన కృష్ణవంశీ

గోవిందుడు అందరివాడేలే సినిమా ఇచ్చిన సక్సెస్‌ దర్శకుడు కృష్ణవంశీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పెద్ద స్టార్లతో సినిమాలు చేయాలనే ఊపు నిచ్చింది. దీంతో కృష్ణవంశీ… గోవాకెళ్లి మరీ జూనియర్‌ ఎన్టీఆర్‌ ను కలిశాడట. షూటింగ్‌ గ్యాప్‌ లో నందమూరి హీరోతో చర్చలు జరిపాడట. ఏ విషయంపై వీళ్లిద్దరూ మాట్లాడుకున్నారు అనే దానిపై స్పష్టత లేకున్నా… టాలీవుడ్ లో మాత్రం ఈ మీటింగ్‌ పై గుసగుసలు నడుస్తున్నాయి. జూనియర్‌ తో కృష్ణవంశీ తన తదుపరి చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడని, బండ్ల గణేష్‌ నిర్మాతని అంటున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో జూనియర్ ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కృష్ణవంశీ మూవీ సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమట.