English | Telugu
రాఖీ 2 వస్తోందా?
Updated : Nov 18, 2014
ఎన్టీఆర్‌లోని నటుడ్ని 100 % బయటకు తీసుకొచ్చిన సినిమా రాఖీ. అందులో రామకృష్ణగా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించాడు. కృష్ణవంశీ స్టైల్ ఆఫ్ హీరో కనిపించాడు ఎన్టీఆర్‌లో. వసూళ్ల పరంగా ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేయకపోయినా.. ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూసే అవకాశం దక్కింది. ''ఈ సినిమా నుంచే నా ప్రయాణం మారింది..'' అని ఎన్టీఆర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. అందుకే ఇప్పుడు కృష్ణవంశీతో మరోసారి జత కట్టడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారమ్. గోవిందుడు అందరివాడేలేతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కృష్ణవంశీ... ఇప్పుడు ఎన్టీఆర్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడట. ''నాకు పూర్తిగా కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే కథ కావాలి..'' అని ఎన్టీఆర్ కృష్ణవంశీకి సూచించాడట.
అందుకు తగినట్టే ఓ కథ రెడీ చేసి ఇటీవలే ఎన్టీఆర్‌కి లైన్ కూడా వినిపించాడట. దానికి ఎన్టీఆర్ కూడా సై అన్నాడట. పూరి సినిమా పూర్తయ్యాకే... కృష్ణవంశీ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయన్నది టాలీవుడ్ టాక్.