English | Telugu
వెంకీ మామ సరసన 'కేజీఎఫ్' భామ!
Updated : Jan 10, 2023
'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేజీఎఫ్ తో ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పటికే 'కోబ్రా'తో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె.. త్వరలో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
గతేడాది 'ఎఫ్-3' చిత్రంతో సందడి చేసిన వెంకటేష్.. త్వరలో 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ తో అలరించనున్నాడు. అలాగే శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 'హిట్-1', 'హిట్-2' చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ కొలను.. వెంకటేష్ కోసం క్రైమ్ థ్రిల్లర్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందట. అంతేకాదు ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని వినికిడి.