English | Telugu

`వీర‌య్య‌`గా మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌‌తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒక‌వైపు `ఆచార్య‌` చిత్రాన్ని పూర్తిచేసే ప‌నిలో బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు `లూసీఫ‌ర్` రీమేక్ ని త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అలాగే `వేదాళ‌మ్` రీమేక్ ని, బాబీ డైరెక్టోరియ‌ల్ ని కూడా లైన్ లో పెట్టారు.

ఇదిలా ఉంటే.. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చిరు చేయ‌బోయే సినిమాకి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో న‌డిచే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి `వీర‌య్య‌` అనే టైటిల్ ని ఫిక్స్ చేశార‌ట‌. అంతేకాదు.. ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా `వీర‌య్య‌` ఉంటుంద‌ని బ‌జ్. త్వ‌రలోనే చిరు - బాబీ కాంబినేష‌న్ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమా.. 2022 ప్ర‌థ‌మార్ధంలో తెర‌పైకి రానుంది.