English | Telugu
రౌడీతో మహానటి.. కొత్తగా సరికొత్తగా...
Updated : Mar 27, 2025
మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించారు. కానీ, ఇద్దరూ జోడీగా నటించలేదు. మహానటిలో కీర్తి టైటిల్ రోల్ పోషించగా, విజయ్ ఆంథోనీ అనే పాత్రలో సమంతకి జోడీగా విజయ్ నటించాడు. అయితే ఇప్పుడు విజయ్-కీర్తి మొదటిసారి పెయిర్ గా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్‌డమ్' సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత దర్శకులు రాహుల్ సాంకృత్యాన్, రవికిరణ్ కోలాతో సినిమాలు కమిటై ఉన్నాడు విజయ్. రవికిరణ్ ప్రాజెక్ట్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి 'రౌడీ జనార్ధన' అనే పవర్ ఫుల్ టైటిల్ ను లాక్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్ గా కీర్తి నటిస్తున్నట్లు తెలుస్తోంది.
2023లో వచ్చిన దసరా, భోళాశంకర్ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు కీర్తి. ప్రస్తుతం హిందీ, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది. మరి ఇప్పుడు విజయ్ సరసన 'రౌడీ జనార్ధన'లో నటించి, తెలుగులో సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.