English | Telugu

పవన్ అమరావతిలో కాటమరాయుడు ఫంక్షన్ వద్దన్నాడా...?

డాలీ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యింది..ఈ మూవీని మార్చి 24న రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్‌ ప్లాన్ చేసింది. అయితే ఆడియో ఎప్పుడెప్పుడు విందామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు పవన్ షాక్ ఇచ్చాడు.. కాటమరాయుడుకు ఎలాంటి ఆడియో ఫంక్షన్ నిర్వహించేది లేదని చిత్రయూనిట్ తెలిపింది..అయితే ఇందుకు ప్రతీగా ప్రి-రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇందుకు వేదికగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి లేదా గుంటూరు, విజయవాడ నగరాల మధ్య అనుకున్ననిర్మాతలు ఇదే విషయాన్ని పవన్‌కు చెప్పారట..

అయితే అందుకు పవర్‌స్టార్ ఇచ్చిన సమాధానం ఏంటంటే.. ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు నేను ఒప్పుకుంటున్నా కాని అమరావతి లేదా విజయవాడల్లో కాకుండా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని చెప్పాడట. అందుకు కారణం లేకపోలేదు.. పవర్‌స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఆయన పాల్గొనే కార్యక్రమాలకు అభిమానులు ఎలా పోటేత్తుతారో తెలిసిందే..అలాంటి చోట్ల తొక్కిసలాటలు జరిగి ప్రమాదాలు జరిగిన సంఘటనలు మనం మర్చిపోలేం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లోని ఏదైనా చిన్న ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని పవన్ కోరాడట.