English | Telugu

కాజ‌ల్ క‌ల్యాణం... ఎవ‌రితోనో తెలుసా????

కాజ‌ల్ ప్ర‌స్తుతం ప్రేమ‌లో ప‌డిపోయిందా?? త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోందా?? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ల‌క్ష్మీ క‌ల్యాణంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కాజ‌ల్‌కు క‌ల్యాణ ఘ‌డియ‌లు ద‌గ్గ‌ర ప‌డ్డాయ‌ని, త్వ‌ర‌లోనే త‌న ప్రేమ వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్ట‌డానికి రంగం సిద్దం చేసుకొంటోందని టాక్ వినిపిస్తోంది. ముంబైకి చెందిన ఓ బిజినెస్ మేన్‌తో కాజ‌ల్ ప్రేమలో ప‌డింద‌ని, ఈ ప్రేమ వ్య‌వ‌హారానికి పెద్ద‌ల మ‌ద్ద‌తు కూడా ల‌భించింద‌ని, ఇద్ద‌రూ.. త్వ‌ర‌లో ఒక్క‌ట‌వ్వ‌బోతున్నార‌ని టాక్‌. కాజ‌ల్ కాబోయే భ‌ర్త‌కు దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో హోటెల్స్ ఉన్నాయ‌ట‌.

ఇద్ద‌రూ త‌ర‌చూ క‌లుస్తున్నార‌ని, ఔటింగుల‌కు వెళ్తున్నార‌ని, అయితే ఈ విష‌యం ఎవ‌రికీ తెలియ‌కుండా గోప్యంగా ఉంచుకొంటున్నార‌ని తెలుస్తోంది. త‌న చేతిలో ఉన్న ప్రాజెక్టుల‌న్నీ అయిపోయాక‌.. పెళ్లి చేసుకొందామ‌ని ఫిక్స‌య్యింద‌ట కాజ‌ల్‌. పెళ్ల‌య్యాక సినిమాల‌కు దూరంగా ఉండాల‌న్న నిర్ణ‌యం తీసుకొంద‌ని, అందుకే ఈలోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాల‌ని ఫిక్స‌య్యింద‌ని తెలుస్తోంది. కాజ‌ల్ వ‌య‌సు 30 దాటేసింది. ఆ లెక్క‌న పెళ్లీడు వ‌చ్చి వెళ్లిపోతున్న‌ట్టే. అందుకే కాజ‌ల్ కూడా త్వ‌ర‌గా పెళ్లి చేసుకోవాల‌ని ఆరాట‌ప‌డుతోంద‌ట‌. బ‌హుశా.. ఈ యేడాదిలోనే కాజ‌ల్‌ని పెళ్లి కూతురిగా చూడ‌డం ఖాయంటున్నారు సినీ జ‌నాలు. మ‌రి కాబోయే వ‌రుడ్ని ఎప్పుడు ప‌రిచ‌యం చేస్తుందో..!