English | Telugu

ఆ రెండు ఛానల్స్ ఇక పవన్‌ను ఎత్తేస్తాయా..?

గత ఎన్నికల్లో నరేంద్రమోడీని ప్రధానిని చేసినా, చంద్రబాబు, కేసీఆర్‌లు ముఖ్యమంత్రులైనా అందులో కీ రోల్ పోషించింది మీడియానే. అలాంటి మీడియా సపోర్ట్ లేకుండా ఏ రాజకీయ పార్టీ కానీ..ఎంతటి చరిష్మా ఉన్న నాయకుడైనా జనంలోకి వెళ్లలేడు..ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్న సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా ఈ విషయం త్వరగానే అర్థమైంది.

అందుకే తెలుగు మీడియాలో పాపులార్ ఛానల్స్ అండను సంపాదించే ప్రయత్నం చేస్తున్నాడు జనసేనాని..రీసెంట్‌గా పవన్ నటించిన కాటమరాయుడు ప్రి రిలీజ్ వేడుకకు రెండు ఛానెల్స్‌కు చెందిన పెద్దలు హాజరవ్వడం..స్టేజ్‌ మీద వారిద్దరూ పవన్‌ను ఆకాశానికెత్తేశారు. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో పవన్ సభలకు సదరు ఛానెల్స్ ఫుల్ కవరేజ్ ఇస్తాయనిపిస్తోంది..ఇప్పటికే పవన్ గురించి పాజిటివ్ కథనాలు వండి వర్చే పనిలో ఆ ఛానెల్స్ బిజీగా ఉన్నాయి..ఇదే కొనసాగితే పవన్ రాజకీయంగా బలపడే సూచనలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.