English | Telugu
పవన్ సాయం ఆయనకు ఇక లేనట్లేనా..?
Updated : Mar 19, 2017
టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్ సపరేట్. ఇతర హీరోల నుంచి ఆయన్ను వేరు చేసింది పవన్ వ్యక్తిత్వమే. ఆపదలో ఎవరున్నా సరే మరేం ఆలోచించకుండా తన వంతు సాయం చేస్తుంటారు. ఈ గుణమే పవన్‌ను అభిమానుల గుండెల్లో దేవుడిని చేసింది. ఆయన స్నేహితులు కూడా అతడి గొప్ప మనసు గురించి వేదికల మీద చెబుతూ ఉంటారు..ఆఖరికి నిన్న కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ చేసే మంచి పనుల గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.
అయితే ఈ వేడుక జరగడానికి ముందు రోజు పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల తాను రెండు కోట్ల దాకా నష్టపోయానంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ నిరాహార దీక్షకు దిగాడు..ఆయనను చూసి మరి కొందరు సర్దార్ బాధితులు తమకు అన్యాయం జరిగిందంటున్నారు..ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు దీని గురించి ఎవ్వరూ వివరణ ఇవ్వలేదు..ఆరోపల్ని ఖండించింది లేదు.. నిర్మాత శరత్ మరార్ కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పందించింది లేదు..కాటమరాయుడు ఆడియో వేడుకలో అయినా పవన్ ఈ విషయంపై ఏమైనా మాట్లాడతాడేమో..ఏదైనా ప్రకటన చేస్తాడేమో అని ఎదురుచూసిన సర్దార్ బాధితులకు పవన్ తన సుదీర్ఘ ప్రసంగంతో నిరాశను మిగిల్చాడు.