English | Telugu

'బాహుబ‌లి' ట్రైల‌ర్ వెనుక ఎవ‌రున్నారో తెలుసా?

బాహుబ‌లి 2 ట్రైల‌ర్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అన్ని భాష‌ల్లో క‌ల‌పి దాదాపు రూ.5 కోట్ల పైచిలుకు వ్యూస్ వ‌చ్చాయి. ఇది ఆల్ ఇండియా రికార్డ్‌! ట్రైల‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ షాక‌య్యారు. ట్రైల‌రే ఇలా ఉంటే.. సినిమా ఇంకెంత బాగుంటుందో అంటూ మురిసిపోయారు. అయితే ఈ ట్రైల‌ర్ క‌ట్ చేయ‌డం వెనుక పెద్ద క‌స‌ర‌త్తే జ‌రిగింది. సాధార‌ణంగా సినిమాలు తీయ‌డానికి స్టోరీ బోర్డులు వేస్తారు. కానీ బాహుబ‌లి 2 ట్రైల‌ర్ క‌టింగ్ చేయ‌డానికి సైతం ఓ స్టోరీ బోర్డ్ వేశార్ట‌. ట్రైల‌ర్ ఇలా ఉండాలి అంటూ.. ఓ స్క్రిప్టు రూపంలో రాసుకొన్నార్ట‌. రాజ‌మౌళి త‌న‌యుడు కార్తీయ‌క‌, ఇలాంటి ట్రైల‌ర్లు క‌ట్ చేయ‌డంలో నిపుణుడైన వంశీ అట్లూరి ఇద్ద‌రూ క‌ల‌సి దాదాపు 24 వెర్ష‌న్లు ట్రై చేశార్ట‌. 25 వ వ‌ర్ష‌న్‌.. మ‌నం చూస్తున్న ట్రైల‌ర్‌! ఈ ట్రైల‌ర్ కోసం ఆరు రోజులు రాత్రీబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింద‌ని తెలుస్తోంది. అయితే... ఫైన‌ల్ వెర్ష‌న్ కోసం రెండు ట్రైల‌ర్లు సిద్ధం చేశారని, మ‌రో ట్రైల‌ర్ క‌ట్ చేసి రెడీగా ఉంచార‌ని స‌మాచారం. అయితే.. అది విడుద‌ల చేయ‌క పోవొచ్చు. సాంగ్ టీజ‌ర్లు, బాహుబ‌లిలోని ఒకొక్క పాత్ర‌కు సంబంధించిన 10 సెక‌న్ల ట్రైల‌ర్లు ప్ర‌స్తుతం సిద్ధ‌మ‌వుతున్నాయ‌ట‌. ఆడియో రిలీజ్ అయిపోయిన త‌ర‌వాత‌.. ఒకొక్కటిగా బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని స‌మాచారం. మ‌రి ఆ బుల్లి టీజ‌ర్లు ఇంకెంత హంగామా సృష్టిస్తాయో చూడాలి.