English | Telugu
శృతి కెరీర్ కు కష్టాలు తెచ్చిపెట్టిన కమల్!
Updated : Jul 11, 2016
ఏ తండ్రైనా తన కొడుకు లేదా కూతురు ఎదుగుదలకు పాటుపడుతుంటాడు. కానీ.. బహుముఖ ప్రజ్ణాశాలి కమల్ హాసన్ మాత్రం తన ముద్దుల కుమార్తె మరియు స్టార్ హీరోయిన్ అయిన శృతి హాసన్ కెరీర్ తో మాత్రం ఆడుకొంటున్నాడు. "శ్రీమంతుడు" లాంటి సూపర్ సక్సెస్ అనంతరం బోలెడు భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ.. తండ్రి తీస్తున్న సినిమా అన్న ఒకే ఒక్క కారణంతో ఆ ఆఫర్లను కాదని "శభాష్ నాయుడు"కి సైన్ చేసింది. మొదటి షెడ్యూల్ ను అమెరికాలో బాగా రిచ్ గా ప్లాన్ చేశారు.
మరి కారణమేంటో తెలియదు కానీ.. అనుకొన్న టైమ్ కంటే దాదాపు రెండు వారాలు షూటింగ్ లేట్ గా జరిగింది. అసలు ప్లాన్ చేసుకొన్న ప్రకారం షూటింగే జరగలేదని, ఆ కారణంగా శృతి "ఎస్ 3" కోసం ఎలాట్ చేసిన డేట్స్ ను మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. దాంతో.. "ఎస్ 3" షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు "ఎస్ 3" డేట్స్ కారణంగా పవన్ కళ్యాణ్ తో రెండోసారి జతకట్టే సువర్ణావకాశాన్ని పోగొట్టుకొనే పరిస్తితి వచ్చిందట. మరి కమల్ కావాలని చేయకపోయినప్పటికీ.. ఇండైరెక్ట్ గా తన కుమార్తె కెరీర్ ను కష్టాల్లో నెట్టాడు!