English | Telugu
సన్నీలియోన్ అభిమానులకు షాక్!
Updated : Jul 11, 2016
"గాంధీగారు ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు మొదలెట్టారు?" అని టక్కున అడిగితే సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలే యువత ఉన్నారు కానీ.. "సన్నీ లియోన్" ఫస్ట్ సినిమా ఏంటీ? అని అడిగితే మాత్రం గుక్కతిప్పుకోకుండా "జీస్మ్ 2" అని చెప్పేస్తారు. సన్నీకి యూత్ లో ఉన్న పాపులారిటీ అలాంటిది. సినిమాల్లోకి రాకముందు నుంచీ సన్నీకి సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ఎలాంటిదని మాత్రం అడగకండి, అదో నీలి నిజం.
ఇక అసలు విషయానికి వస్తే.. నిన్నటివరకూ తన సొగసుల సత్తాతో యువ హృదయాల్లో చెరగని సంతకం చేసిన సన్నీ ఇక సినిమాలకు స్వస్థి పలకాలనుకుంటుందట. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ మాట్లాడుతూ.. "సినిమాలనేవి సంపాదన కోసమే కానీ పేరు మాత్రం ఉండదు, నాకంటూ నటిగా కాకుండా వ్యక్తిగా పేరు సంపాదించుకోవాలనుకోంటున్నాను. అందుకే త్వరలోనే సినిమాలకు స్వస్థి పలికి.. ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తాను" అంటోంది. సన్నీ తీసుకొన్న నిర్ణయం ఆమె అభిమానులకు తేరుకోలేని తీరని షాక్ ఇచ్చింది. ఈ షాక్ నుంచి వారు బయటపడాలంటే.. సన్నీ నటించిన కొత్త సినిమా ఏదో ఒకటి అర్జెంటుగా రిలీజ్ అవ్వాల్సిందే!