English | Telugu

రజనీతో పోటీపడుతున్న రష్మీ!

కంటెంట్ తో సంబంధం లేకుండా కేవలం అందాల ప్రదర్శనతోనే కోట్లు కొల్లగొడుతున్న రాకింగ్ బ్యూటీ రష్మీ.. వరుసగా రెండు హిట్లు కొట్టేసరికి.. ఏకంగా ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తోనే పోటీకి సిద్ధపడుతోంది. రష్మీ నటించిన తాజా చిత్రం "రాణిగారి బంగ్లా". హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మీ మినహా ముఖపరిచయం ఉన్న ఆర్టిస్ట్ ఒక్కరూ లేరు. అలాంటి చిత్రాన్ని సూపర్ స్టార్ రాజనీకాంత్ నటించిన "కబాలి" విడుదలవుతున్న రోజే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.
జూలై 22న "కబాలి" విడుదలవుతుండగా.. అదే తేదీన "రాణిగారి బంగ్లా" చిత్రాన్ని కూడా విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. "కబాలి" టికెట్ల కోసం థియేటర్లకు వచ్చిన జనాల్లో టికెట్ దొరకనివారు కనీసం సగం మంది వారి సినిమా చూసినా చాలనుకొంటున్నారట. ఎలాగూ రష్మీ ఉంది కాబట్టి.. సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ.. అందుకే అంత ధైర్యంగా "రాణిగారి బంగ్లా" సినిమాను "కబాలి"తో పోటీగా విడుదల చేస్తున్నారు!