Read more!

English | Telugu

కమల్ తేల్చేశాడు

తమిళనాడులో సినిమాలకు, రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం వుంటుంది. ఎందుకంటే అక్కడి ప్రముఖ రాజకీయ నాయకులంతా సినీ రంగం నుంచి వచ్చినవారే కాబట్టి. ప్రస్తుతం తమిళనాడులో నేలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరో ఇద్దరూ పెద్ద హీరోల రాజకీయ రంగ ప్రవేశం గురుంచి ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. వారిలో ఒకరు కమలహాసన్. అయితే తన 60వ పుట్టినరోజు సందర్భంగా కమల్ హాసన్ ఈ చర్చలకు ముగింపు పలికారు. తాను రాజకీయాలు కావాలనుకుంటే ఎప్పుడో ఎమ్మెల్యే లేదా ఎంపీని అయ్యేవాడిని అని అన్నారు. అలాగే ప్రజలకు సేవ చేయడం తనకు ఇష్టమని, అయితే రాజకీయాల ద్వారా కాకుండా సినిమాల ద్వారానే సేవ చేస్తానని ఆయన వివరించారు. దీంతో కమల్ రాజకీయాల్లోకి వస్తారంటూ వచ్చే పుకార్లకు ఆయన ముగింపు పలికారు.