English | Telugu

కాజల్ 'టెంపర్' పెంచబోతుంది..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్, అభిమానుల 'టెంపర్'ను హీటెక్కించ‌డం ఖాయ‌మ‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో కాజల్ నటిస్తున్న చిత్రం ఇదొక్కటే కావడంతో, ఈ సినిమాలో తన గ్లామర్ తడఖా చూపించి మరిన్ని అవకశాలు దక్కించుకోవాలని భావిస్తుందట. ఇది వ‌ర‌కు ఎన్న‌డూ చూడ‌ని కాజ‌ల్‌ని ఈసినిమాలో చూస్తారంటూ... ఇప్పటికే పూరి కూడా ఓ హింట్ ఇచ్చేశాడు. ఇటీవల గోవాలో చిత్రీకరించిన పాటలో కాజల్ రేచ్చిపోయిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమాకే ఆ పాట హైలెట్ అవుతుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. మరి కాజల్ ఏ మేరకు అభిమానుల 'టెంపర్' రేపుతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే!