English | Telugu

ఈసారి ఆంధ్రావాలా కాదంట !

 

ఎన్టీఆర్ నటించిన "సింహాద్రి" బ్లాక్ బస్టర్ హిట్. అప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్ "ఇడియట్", "అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి" వంటి వరుస హిట్ చిత్రాలతో టాప్ 1లో ఉన్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనగానే జనాల్లో అంచనాలు ఎక్కువయ్యాయి. ఆ సినిమాయే "ఆంధ్రావాలా". ఈ సినిమా ఆడియో రీలీజ్ కార్యక్రమానికి చేసిన హంగామా ఇప్పటివరకు ఎవరు చేయలేరు. దాంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కానీ సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడంతో అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

సీన్ కట్ చేస్తే ... పది సంవత్సరాల తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రీపీట్ కాబోతుంది. "హార్ట్ ఎటాక్" చిత్రం ఘనవిజయంతో ఫుల్ జోష్ లో ఉన్న పూరీ.. ఎన్టీఆర్ కోసం ఒక లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ కథను సిద్ధం చేస్తున్నాడట.

అసలే "రామయ్య వస్తావయ్యా" సినిమా అనుకోని ఘోర పరాజయం కావడంతో ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న "రభస" చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా గతకొంత కాలంగా షూటింగ్ వాయిదాలు పడుతూ వస్తుంది. సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడి అనారోగ్యం కారణంగా అసిస్టెంట్ డైరెక్టర్స్ తో కొన్ని సన్నివేశాలను, పాటలను తెరకెక్కించారని తెలిసింది. కానీ ఎన్టీఆర్ మాత్రం పూరీనే నమ్ముకున్నాడు.

గతకొంతకాలంగా సరైన హిట్టులేక అభిమానులను నిరాశపరుచుతున్న ఎన్టీఆర్... ఈసారి ఎలాగైనా అభిమానులకు ఒక మంచి చిత్రాన్ని అందించాలని ఆతృతగా ఉన్నాడు. ప్రస్తుతం తారక్ కోసం పూరీ ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. "ఆంధ్రావాలా" వంటి ఫ్లాప్ రీపీట్ కాకుండా పూరీ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలిసింది. మరి ఈ సినిమా అయిన వీరిద్దరి కాంబినేషన్ ను మరోసారి రీపీట్ చేసే విధంగా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందో లేక మరో ఆంధ్రావాలా అవుతుందో త్వరలోనే తెలియనుంది.