English | Telugu

ఎన్టీఆర్ తండ్రి కాబోతున్నాడట !

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఇలాంటి వార్తలు గతంలో కూడా వినిపించాయి. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని తెలిసింది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ ఎలాంటి అధికారికంగా తెలియజేలేదు. ఈ వార్త వినడానికి అభిమానులకు పెద్ద శుభవార్త అయినప్పటికీ... ఇది ఎంతవరకు నిజమో ఎన్టీఆర్ చెప్పేవరకు వేచిచూడాల్సిందే.

ప్రస్తుతం ఎన్టీఆర్ "రభస" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాలో నటించనున్నాడు.