English | Telugu

ఎన్టీఆర్ సినిమా మ‌రో స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ అవుతుందా?

ఏ క‌థానాయ‌కుడైనా, ఎంత పెద్ద నిర్మాత అయినా ద‌ర్శ‌కుడ్ని న‌మ్మాల్సిందే. అత‌ని విజ‌న్ కి విలువ ఇవ్వాల్సిందే. కానీ కొంత‌మంది హీరోలు.. ద‌ర్శ‌కుడ్ని డ‌మ్మీలుగా మార్చేస్తారు. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయాడ‌ని టాలీవుడ్ టాక్‌. ఎన్టీఆర్ - బాబి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. జై ల‌వ‌కుశ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే... బాబి ఈ సినిమాకి డ‌మ్మీ ద‌ర్శ‌కుడ‌ని... మొత్తం అంతా ఎన్టీఆరే న‌డిపిస్తున్నాడ‌ని, కెమెరా మెన్ మ‌ది స‌హ‌కారంతో సినిమాకి తెర వెనుక ద‌ర్శ‌కుడి అవ‌తారం ఎత్తాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకొంటున్నాయి.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌కుడైనా... సెట్లో ఆయ‌న‌ది అతిథి పాత్ర అని, సినిమా అంతా ప‌వ‌న్ తీసుకొన్నాడ‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఆ సినిమా ఫ్లాప్ అయిన‌ప్పుడు కూడా బాబీని ఎవ్వ‌రూ త‌ప్పు ప‌ట్ట‌లేదు. దానికి గ‌ల కార‌ణం.. ఈ సినిమాకి తెర వెనుక ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ అన్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విష‌యంలోనూ ఇదే సీన్ రిపీట్ అవ్వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఎన్టీఆర్ ద‌ర్శ‌కుల న‌టుడు. ద‌ర్శ‌కుడు ఎలా కావాలంటే అలా మ‌ల‌చుకోవొచ్చు. తొలిసారి ఎన్టీఆర్‌.. ద‌ర్శ‌కుడ్ని న‌డిపిస్తున్నాడు. అదే విచిత్రం. స‌ర్దార్ విష‌యంలో ప‌వ‌న్ చేసిన త‌ప్పే.. ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్నాడు. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో మ‌రి.