English | Telugu

87 కోట్లు...కాటమరాయుడికి సాధ్యమా..?

సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఫ్యాన్స్‌కి అదిరిపోయే హిట్ ఇవ్వాలనుకున్నారు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. దానిలో భాగంగా గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమా చేశారు..ఈ శుక్రవారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి అంచనాలు లేని కాటమరాయుడికి టీజర్, సాంగ్స్, ట్రైలర్‌లు రిలీజ్ అయిన తర్వాత భారీ హైప్ వచ్చింది. ఆ అంచనాలే కాటమరాయుడు ప్రి రిలీజ్ బిజినెస్ భారీగా జరిగేందుకు కారణమైంది.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ మూవీ ఆడియో, వీడియో, శాటిలైట్ ఇతర హక్కులు కలుపుకుని రూ.105 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. అంతా చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ ఇంత పెట్టి హక్కులు కొనుక్కొన్న డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడితో పాటు లాభాలు పొందాలంటే కాటమరాయుడు 87 కోట్ల బ్రేక్ ఈవెన్‌ను రాబట్టాలి. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఓపెనింగ్స్‌కి డోకా ఉండదు..కాని సేఫ్‌జోన్‌లోకి వెళ్లాలంటే లాంగ్‌ రన్‌లో కూడా సంచలనాలు సృష్టించాలి. అది సినిమా ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఫలితం అటు ఇటూ అయ్యిందంటే "సర్దార్" నాటి సినిమా కనబడటం ఖాయం.