English | Telugu

పవన్‌కి రాజమౌళిని కొట్టే ద‌మ్ముందా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ కాట‌మ‌రాయుడు మానియా ప్ర‌పంచ మంతా పాకేసింది. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అంటూ... ఫ్యాన్స్ ఆత్రుత‌తో ఉన్నారు. ప్ర‌స్తుతం ఉన్న హైప్ చూస్తుంటే... కాట‌మ‌రాయుడు తొలి రోజునే టాలీవుడ్‌ రికార్డుల్ని బ్రేక్ చేసేయ‌డం ఖాయంగా అనిపిస్తోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ డే టికెట్ల‌న్నీ అమ్ముడైపోయాయి. మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ఒక్క టికెట్ కూడా లేదు. బెనిఫిట్ షోల టికెట్ రూ.1000 నుంచి 2000 ల వ‌ర‌కూ ప‌లుకుతోంది. ప్ర‌స్తుతం ఉన్న ట్రెండ్‌ని బ‌ట్టి చూస్తే.. కాట‌మ‌రాయుడు తొలి రోజున రూ.25 కోట్లు వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

అదే గ‌నుక జ‌రిగితే తొలి రోజున రూ.23 కోట్లు సాధించిన ఖైదీ నెం.150 రికార్డుల్ని కాట‌మ‌రాయుడు బ్రేక్ చేసేయ‌డం ఖాయం. ఒక్క నైజాంలోనే రూ.6 కోట్ల వ‌ర‌కూ సాధించొచ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. నైజాం వ‌ర‌కూ చూస్తే తొలి రోజు రికార్డు బాహుబ‌లిదే. తొలిరోజున బాహుబ‌లి రూ.6.4 కోట్ల వ‌ర‌కూ సాధించింది. ఆ రికార్డు సాధించ‌డం కాట‌మ‌రాయుడుకి కాస్త క‌ష్ట‌మే. అదే కాకుండా బాహుబలి మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌ని కొట్టడం కాటమరాయుడికి దాదాపు అసాధ్యం. ఊహించ‌ని రీతిలో బెనిఫిట్ షోలు ప‌డి.. ఒకొక్క టికెట్ రూ.2 వేల వ‌ర‌కూ కొన‌గ‌లిగితే... బాహుబ‌లికి దరిదాపుల్లోకి వెళ్లవచ్చు..కాని ఆ రికార్డును బ్రేక్ చేయడం మాత్రం ఇంచుమించు కష్టమే. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.