English | Telugu
ఎన్టీఆర్ నాగ్ ల ముహూర్తం డేట్
Updated : Mar 11, 2014
ఎన్టీఆర్, నాగార్జున ప్రధాన పాత్రలలో ఓ మల్టీస్టారర్ చిత్రం రూపొందనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఏప్రిల్ 15న జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా జరుగుతున్నాయని, దర్శకుడు వంశీ పైడిపల్లి అదిరిపోయే కథను సిద్ధం చేసాడని తెలిసింది. ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్ పై నిర్మాత పొట్లూరి ప్రసాద్ నిర్మించనున్నారు.
నిజానికి ఈ సినిమా డిసెంబర్ నెలలో సెట్స్ పైకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ "రభస" చిత్ర షూటింగ్ లేట్ అవడం, నాగ్ "మనం" షూటింగ్ కూడా దాదాపు పూర్తవడంతో ఈ మల్టీస్టారర్ ముందుగానే సెట్స్ పైకి రాబోతున్నట్లు సమాచారం. అసలే వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు వంశీ దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ చిత్రం అని తెలియగానే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా గురించి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.