English | Telugu
మహేష్ ఆగడులో తారక్ ఎంట్రీ ?
Updated : Mar 24, 2014
శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న "ఆగడు" చిత్రంలో మరొక స్పెషల్ హీరో కనిపించబోతున్నాడని సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇందులో ఓ గెస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే ఎన్టీఆర్ తో దర్శకుడు శ్రీనువైట్ల "బాద్ షా" అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అలాగే ఎన్టీఆర్, మహేష్ ల మధ్య మంచి స్నేహం ఉంది. అందువల్లే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది.
మహేష్ ఇందులో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న పాటలను కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.