English | Telugu
తారక్ - కొరటాల.. 'సెన్సేషనల్' టైటిల్!
Updated : Jun 7, 2021
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ని కొత్త కోణంలో ఆవిష్కరించిన దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. 'జనతా గ్యారేజ్'లో తారక్ ని కొరటాల చూపిన విధానానికి నందమూరి అభిమానులే కాదు బాక్సాఫీస్ సైతం ఫిదా అయిపోయింది. అందుకే.. తెలుగునాట 'జనతా గ్యారేజ్' రూపంలో మరో `సెన్సేషనల్` హిట్ నమోదయింది.
కట్ చేస్తే.. ఐదేళ్ళ విరామం అనంతరం తారక్ - శివ మరోమారు జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి పాన్ - ఇండియా మూవీతో ఈ క్రేజీ కాంబినేషన్ సందడి చేయనుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని 2022 ఏప్రిల్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పాన్ - ఇండియా అప్పీల్ కి తగ్గట్టు 'ఎన్టీఆర్ 30'కి ఓ యూనివర్శల్ టైటిల్ ని ఫిక్స్ చేసిందట కొరటాల అండ్ టీమ్. ఆ టైటిల్.. 'సెన్సేషనల్'. మరి.. టైటిల్ కి తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా 'సెన్సేషనల్' అనిపించుకుంటుందేమో చూడాలి.
కాగా, 'ఎన్టీఆర్ 30'ని యువసుధ ఆర్ట్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో తారక్ కి జంటగా కియారా అద్వాని నటించే అవకాశముందని ప్రచారం సాగుతోంది.