English | Telugu
త్వరలో రాజ్ తరుణ్ పెళ్లి!!
Updated : Jun 7, 2021
హిట్ తో సినీ జర్నీ స్టార్ట్ చేయాలని ఎందరో కలలు కంటారు. కానీ ఆ లక్ కొందరికే ఉంటుంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ మాత్రం మొదటి మూడు సినిమాలతో వరుస హిట్స్ అందుకొని తన జర్నీని గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు. 'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21F' ఇలా మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన రాజ్ తరుణ్.. ఆ తరువాత మాత్రం అనేక ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడు. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ యంగ్ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది.
రాజ్ తరుణ్ ఇటీవలే హైదరాబాద్ లో సొంత ఇల్లు కట్టుకుని.. తల్లిదండ్రులతో పాటు ఆ ఇంట్లోకి మారాడు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడు కావాలని అనుకుంటున్నాడట. రాజ్ తరుణ్ త్వరలో తను ఇష్టపడిన అమ్మాయిని పెద్దల సమ్మతితో పెళ్లి చేసుకోనున్నాడని టాక్ వినిపిస్తోంది. ముందు నిశ్చితార్థం చేసుకొని.. అనంతరం ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక సినిమాల విషయానికొస్తే రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ మూవీ స్ చేస్తున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో 'ఒరేయ్ బుజ్జిగా' మూవీ మొదట ఓటీటీలోనూ, ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో థియేటర్లలోనూ విడుదలైంది. అలానే ఇటీవల ఆయన నటించిన 'పవర్ ప్లే' మూవీ కూడా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో 'స్టాండప్ రాహుల్' అనే సినిమాలో నటిస్తున్నాడు.