English | Telugu

బాలయ్యకు నాని జెండా భయపడుతుందా ..?

 

ఫిబ్రవరి నెలలో హీరో నాని నటించిన "పైసా", "ఆహా కళ్యాణం" రెండు చిత్రాలు కూడా ఘోర పరాజయం పాలయ్యాయి. అయితే నాని నటించిన "జెండాపై కపిరాజు" చిత్రాన్ని మార్చి 7వ తేదిన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో మళ్ళీ ఈ విడుదలను వాయిదా వేసారు. మార్చి చివర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కానీ మార్చి నెల చివర్లో కూడా ఈ సినిమా విడుదల అవుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే.. టాలీవుడ్ మొత్తం ఎంతో ఎదురుచూస్తున్న బాలకృష్ణ "లెజెండ్" సినిమా మార్చి 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ బాలకృష్ణ ఫిక్సయితే నాని సినిమాను చూసే నాధుడు కూడా దొరకడం కష్టం అవుతుందేమో అని టాలీవుడ్ వర్గాల అంచనా. ఎలాగో "లెజెండ్" ప్రభావం ఏప్రిల్ చివరి వరకు కొనసాగుతుంది కాబట్టి... నాని సినిమా మే నెలలో విడుదల అవుతుందేమో చూడాలి.