English | Telugu

జయసుధకు కోపం తెప్పించిన దర్శకుడు

నిండైన చీరకట్టు...ముఖంపై చెరగని చిరునవ్వు ఇవన్నీ కలగలిస్తే జయసుధ. ప్రియురాలిగా, తల్లిగా, చెల్లిగా, భార్యగా, ఇలా అన్ని తరహా పాత్రలు పోషించి సహజనటిగా గుర్తింపు పొందారు. సుమారు రెండు దశాబ్ధాల పాటు తెలుగు తెరను ఏలిన జయసుధ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ప్రస్తుతం కుర్రహీరోలకు అమ్మగా నటిస్తూ బిజీ ఆర్టిస్టుగా ఉన్నారు . తాజాగా విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ ఆర్.నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న కానిస్టేబుల్ వెంకట్రామయ్యలో ఆయన భార్యగా నటిస్తున్నారు జయసుధ. ఈ చిత్రానికి దర్శకుడు కమ్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. ఇటీవల బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన బిచ్చగాడు నిర్మాత ఇయనే.

అయితే ఏవో వ్యక్తిగత కారణాల వల్ల జయసుధ షూటింగ్‌కు కాస్త ఆలస్యంగా వస్తున్నారు. ఒకసారి చూసీచూడనట్టు వదిలేసిన దర్శకుడు చదలవాడ..మరోసారి ఆలస్యంగా రావడంతో జయసుధపై అసహనం వ్యక్తం చేశాడట. దీంతో స్వతహాగా సెట్‌లో, బయట ఎంతో శాంతంగా ఉండే జయసుధకు కోపం తన్నుకువచ్చిందట. మహామహులైన దర్శకులతోనే తాను మాట పడింది లేదని అలాంటిది నిన్న గాక మొన్న వచ్చిన చదలవాడతో మాట పడటం ఏంటని బాధ పడ్డారట..ఈ కారణంగా ఆ రోజు షూటింగ్‌కు బ్రేక్ పడిందని సమాచారం. వీరిద్దరికి రాజీ కుదర్చడానికి పీపుల్స్ స్టార్ ట్రై చేస్తున్నారట.