English | Telugu

ర‌కుల్ ల‌వ్ మేట‌ర్ బ‌య‌ట‌ప‌డిపోయిందా?

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ నాలుగు సినిమాలు చేశాడో లేదో.. త‌న‌పై న‌ల‌భై పుకార్లు పుట్టుకొచ్చేశాయి. న‌లుగురు హీరోయిన్ల‌తో సాయి ల‌వ్ ఎఫైర్ న‌డిపిన‌ట్టు గాసిప్పులు వ‌చ్చాయి. వీటిపై ఏనాడూ సాయిధ‌ర‌మ్ నోరు విప్ప‌లేదు. కానీ.. ల‌వ్ మ్యాట‌ర్లు మాత్రం ఏదో రూపంలో బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. రెజీనా, రాశీఖ‌న్నాల‌తో సాయి ప్రేమాయ‌ణం న‌డిపాడ‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. ప్ర‌గ్యా జైస్వాల్‌తో చ‌ట్టాప‌ట్టాలేసుకొని తిరుగుతున్నాడ‌ని చెప్పుకొన్నారు. ఇప్పుడు ర‌కుల్ ప్రీత్ సింగ్‌నీ ప‌టాయించేశాడ‌న్న‌ది లేటెస్ట్ టాలీవుడ్ టాక్‌. వీరిద్ద‌రూ క‌ల‌సి విన్న‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాట‌లో ర‌కుల్ ఓ లాకెట్ ధ‌రించింద‌ట‌.

ఆ లాకెట్‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ ఫొటో ఉంద‌ని, ఇది ఆనోటా.. ఈనోటా యూనిట్ మొత్తానికి తెలిసిపోయింద‌ని, లాకెట్ విష‌యంలో ఏం చెప్పాలో తెలీక ర‌కుల్ నీళ్లు న‌మిలింద‌ని టాక్‌. అస‌లు ఆ లాకెట్ ర‌కుల్ ఎందుకు ధ‌రించిందో అర్థం కావ‌డం లేదు. సినిమా కోస‌మే ఆ లాకెట్ త‌యారు చేశారా, లేదంటే ర‌కుల్ కావాల‌ని లాకెట్ త‌యారు చేయించుకొందా? అనేది తేలాలి. విన్న‌ర్ సినిమాలో లాకెట్‌కి సంబంధించిన సీన్ ఉంటే.. ఇది క‌చ్చితంగా సినిమా కోస‌మే అనుకోవాలి. లేదంటే మాత్రం ర‌కుల్ మ‌న‌సులో సాయిధ‌ర‌మ్ ఉన్నాడ‌ని అర్థం చేసుకోవాలి. ఈ సంగ‌తంతా తెలియాలంటే విన్న‌ర్ సినిమా విడుద‌ల కావాల్సిందే.