English | Telugu

ప‌వ‌న్ అభిమానుల‌పై కుట్ర జ‌రుగుతోందా?

హీరో ఎవ‌రైనా, ఆడియో ఫంక్ష‌న్ ఎవ‌రిదైనా.... ప‌వ‌ర్ స్టార్‌.. ప‌వ‌ర్ స్టార్ అంటూ... దాదాపుగా ప్ర‌తీ ఆడియో ఫంక్ష‌న్‌లోనూ, ప‌వ‌న్ నామ జ‌పం చేసే అభిమానుల్ని చూస్తూనే ఉంటాం. దీన్ని అలుసుగా చేసుకొని ప‌వ‌న్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయ‌డానికి కొంత‌మంది ప్ర‌య‌త్నిస్తున్నారేమో అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల్ని టార్గెట్ చేసేవాళ్లు రోజురోజుకీ ఎక్కువైపోతున్నారు. రాంగోపాల్ వ‌ర్మ అయితే.. ప‌వ‌న్ అభిమానులు నిర‌క్ష‌రాస్యులు అనే రేంజులో మాట్లాడాడు. మొన్న వంగ వీటి ఆడియో ఫంక్ష‌న్‌లోనూ ప‌వ‌ర్ స్టార్ అభిమానుల సెగ తాకింది. ధృవ వేడుక‌లోనూ ప‌వ‌ర్ స్టార్‌... అనే నినాదాలు మిన్నంటాయి. అంత‌కు ముందు బ‌న్నీ కీ ఇలాంటి సౌండింగులే వినిపించాయి.. విసిగించాయి.

మెగా హీరోలైతే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల వ‌ల్లే త‌మ ఆడియో ఫంక్ష‌న్‌ల‌లో ర‌గ‌డ జ‌రుగుతోంద‌న్న తీర్మానానికి వ‌చ్చేశారు. అయితే... దీని వెనుక కూడా ఓ ర‌క‌మైన కుట్ర జ‌రుగుతోందా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కొంత‌మంది ఓ బృందంగా ఏర్ప‌డి, చేతిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పోస్ట‌ర్ల‌ని ప‌ట్టుకొని ప‌వ‌ర్ స్టార్‌.. ప‌వ‌ర్ స్టార్ అని అరుస్తుంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు స‌రైన డిసిప్లెన్ లేద‌న్న సంకేతాల్ని పంపించ‌డానికి రెడీ అవుతున్నార‌ని, ప‌రోక్షంగా అది ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని.. ఇలా ప‌వ‌న్ పేరు వాడుకొంటున్నార‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆడియో వేడుక‌ల్లో ప‌వ‌ర్ స్టార్ అంటూ అరిచే వాళ్ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కూ సంబంధం లేద‌ని, కేవలం ఫ్యాన్స్‌కి చెడ్డ పేరు తేవ‌డానికే ఇలాంటి ప‌నులు చేస్తున్నార‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు. వంగ‌వీటి ఆడియోఫంక్ష‌న్ లో యాంక‌ర్ ఝాన్సీ కూడా ప‌రోక్షంగా ప‌వన్ పేరు ప్ర‌స్తావిస్తూ `మీ హీరోకి చెడ్డ‌పేరు తీసుకొస్తున్నారు` అంటూ ఎత్తిపొడిచింది. ఇలాంటి కామెంట్ల కోస‌మే.. ప‌వ‌న్ పేరు వాడుకొంటున్నార‌న్న‌ది ప‌వ‌న్ అభిమానుల మాట‌.చూస్తుంటే.. ప‌వ‌న్ అభిమానుల్ని ఎవ‌రో కావాల‌ని టార్గెట్ చేసిన‌ట్టు అర్థం అవుతోంది. వాళ్లెవ‌రో.. ఇదంతా ఎందుకుచేస్తున్నారో??