English | Telugu
తన మార్కు పెంచేసిన జితేంద్ర
Updated : Apr 9, 2014
ఇప్పటివరకు హీరోగా మాత్రమే నటించిన జగపతిబాబు తొలిసారిగా "లెజెండ్" సినిమాలో జితేంద్ర గా విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో జగపతి నటనకు ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. బాలకృష్ణ హీరోయిజానికి జగపతి విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఈ సినిమా ఇటీవలే విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం బాలయ్య ఈ చిత్రం విజయ యాత్రలో ఉన్నారు.
అయితే విలన్ గా నటించిన మొదటి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో జగపతి తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసినట్లుగా తెలిసింది. ఇటీవలే రియల్ స్టార్ శ్రీహరి మరణించడంతో ఆయన స్థానంలో జగపతి బాబు అయితే బాగుంటుందని చాలా మంది దర్శక, నిర్మాతలు జగపతిని సంప్రదించారు. కానీ "లెజెండ్"తో వచ్చిన సక్సెస్ కు జగపతి తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే రెమ్యునరేషన్ కూడా పెంచేసాడని సమాచారం. ప్రస్తుతం జగపతి "పిల్లా నువ్వులేని జీవితం", "రా రా కృష్ణయ్య" సినిమాల్లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.