English | Telugu
చరణ్ తండ్రి.. బాలయ్య విలన్ అవుతాడా?
Updated : Mar 24, 2014
కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం అనుకున్న క్షణం నుండి అన్ని కొత్త కొత్త వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో ముందుగా నటుడు కృష్ణ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు అని అన్నారు. కానీ కృష్ణ ఈ ప్రాజెక్టు చెయ్యట్లేదు. అలాగే చరణ్ కు బాబాయ్ పాత్రలో ప్రముఖ నటుడు వెంకటేష్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వెంకటేష్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో ఆ పాత్రలో శ్రీకాంత్ ను తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో మరో అగ్ర హీరో కూడా చేరుతున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు హీరోగా తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు జగపతిబాబు ఇటీవలే "లెజెండ్" సినిమా ద్వారా విలన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అలాగే "పిల్లా నువ్వులేని జీవితం" వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే కృష్ణవంశీ మల్టీస్టారర్ సినిమాలో చరణ్ కు తండ్రి పాత్రలో జగపతిబాబు నటించబోతున్నట్లు తాజా సమాచారం. ఈ విషయంపై త్వరలోనే ఓ అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కాజల్, శ్రీకాంత్ సరసన కమలిని ముఖర్జీ నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.