English | Telugu

ట్రాన్స్ జెండర్ పాత్రలో నాని.. నేషనల్ అవార్డు గ్యారెంటీ!

ట్రాన్స్ జెండర్ పాత్రలో నాని.. నేషనల్ అవార్డు గ్యారెంటీ!

 

దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ది పారడైస్'. ఇటీవల విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కథా నేపథ్యం, నాని గెటప్ చూసి అందరూ సర్ ప్రైజ్ అయ్యారు. రెండు జడలు, ముక్కుపుడుకతో నెవెర్ బిఫోర్ లుక్ లో నాని కనిపించాడు. అయితే ఈ సినిమాలో నాని రోల్ కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. (The Paradise)

 

'పారడైస్'లో నాని ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపిస్తాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంతో తెలియదు కానీ, ఒకవేళ నిజమైతే మాత్రం.. ఇది సెన్సేషన్ అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో లేడీ గెటప్ వేసిన స్టార్స్ ఉన్నారు కానీ, ట్రాన్స్ జెండర్ రోల్ చేసిన స్టార్స్ లేరనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు నాని ట్రాన్స్ జెండర్ రోల్ చేస్తే.. ఖచ్చితంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది అనడంలో సందేహం లేదు. పైగా నాని.. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ట్రాన్స్ జెండర్ పాత్ర పోషిస్తే.. నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదు.

 

ఇక 'పారడైస్' మూవీకి సంబంధించి మరో ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. 'పారడైస్'ను రెండు భాగాలుగా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఉన్నాడట. నిర్మాత సుధాకర్ చెరుకూరి సైతం రెండు భాగాలు చేయడానికి సుముఖత వ్యక్తం చేశారట. అయితే నాని మాత్రం నో అంటున్నాడట. బాహుబలి నుంచి ఈ రెండు పార్ట్ ల ట్రెండ్ ఊపందుకుంది. భారీ సినిమాలు అన్నింటినీ రెండు భాగాలుగా చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇలా అన్ని సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండంపై ప్రేక్షకుల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. అందుకే నాని.. "రెండు భాగాలు వద్దు, ఒకే సినిమా ముద్దు" అంటున్నాడట. రన్ టైం ఎక్కువైనా పర్లేదు కానీ, చెప్పాలనుకున్న కథని ఎఫెక్టివ్ గా ఒకే సినిమాలో చెప్పేద్దామని నాని సూచించాడట. మరి నాని అదే మాటకు కట్టుబడి ఉంటాడో లేక షూటింగ్ మధ్యలో దర్శకనిర్మాతల ఆలోచనకు తగ్గట్టుగా రెండు పార్ట్ ల వైపు మొగ్గు చూపుతాడో చూడాలి.