English | Telugu

ఇలియానా మ్యారేజ్ మ్యానేజ్ చేసుకుందా..?

తీగ లాంటి నడుముతో తెలుగు కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టి ముంబై చెక్కిసింది ఇలియానా. టాలీవుడ్‌లో ఉన్నపుడు కాస్త పద్ధతిగా ఉన్న ఇల్లిబేబి..బాలీవుడ్‌లో మాత్రం అలాంటివన్నీ వదిలేసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా ఫోటోలు పెట్టడంతో పాటు ప్రేమలో పడ్డట్టు కూడా తెలిపింది. డేటింగ్ గురించి ఇంత పబ్లిగ్గా చెప్పినా పెళ్లి గురించి మాత్రం ఎవరికీ చెప్పకుండా చేసుకుందంటూ ముంబై మీడియా గగ్గోలు పెడుతోంది. తన ఆస్ట్రేలియా బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోస్‌తో ఇలియానాకు గత డిసెంబర్‌లోనే పెళ్లయినట్లు బీటౌన్ కోడై కూస్తోంది. ఇలియానా నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌‌ అవ్వడంతో ఇక హౌజ్‌వైఫ్‌గా మారిపోదామని డిసైడ్ అయ్యిందట ఈ గోవా బ్యూటీ. అయితే అక్షయ్ కుమార్‌తో నటించిన రుస్తుం సూపర్‌హిట్ అవ్వడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందడంతో ఇల్లీబేబికి ఆఫర్లు క్యూకడుతున్నాయి అందుకే ఈ రహస్యాన్ని ఇలియానా దాచేసిందట. ఇంత జరుగుతున్నా కపుల్స్ ఇద్దరు నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది.