English | Telugu

బ‌న్నీ ఫ్లాప్ హీరోయిన్ ని ప‌ట్టాడేంటి?

ఇండ్ర‌స్ట్రీలో సెంటిమెంట్లు జాస్తి. అందునా హీరోయిన్ల విష‌యంలో. ఓ హీరోయిన్ ఓహీరోకి ఫ్లాప్ ఇచ్చిందంటే.. మ‌ళ్లీ ఆ హీరోతో ఛాన్స్ ద‌క్కించుకోవ‌డం అసాధ్య‌మ‌నే చెప్పాలి. అయినా స‌రే... అల్లు అర్జున్ ఏరికోరి ఫ్లాప్ హీరోయిన్‌ని ప‌ట్టుకోబోతున్నాడు. ఆ క‌థానాయిక ఎవ‌రో కాదు.. కాజ‌ల్‌. ఈ ముద్దుగుమ్మ‌కి ఇటీవ‌ల భారీ ఫ్లాపులు ఎదురొచ్చాయి. బ్ర‌హ్మోత్స‌వం, స‌ర్దార్‌ గ‌బ్బ‌ర్‌సింగ్ డిజాస్ట‌ర్లుగా మిగిలాయి. హిందీలో చేసిన దో ల‌వ్జోంకీ క‌హానీ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయినా స‌రే.. బ‌న్నీ త‌న కొత్త సినిమాకి కాజ‌ల్‌నే హీరోయిన్ గా కావాలి అంటున్నాడ‌ట‌. బ‌న్నీ - కాజ‌ల్‌లు క‌ల‌సి న‌టించిన ఆర్య 2 కూడా ఫ్లాపే. ఆ లెక్క‌న బ‌న్నీకి కూడా కాజ‌ల్ ఫ్లాప్ ఇచ్చింది. కానీ... బ‌న్నీ మాత్రం కాజ‌ల్‌నే కోరుకొంటున్నాడు విడ్డూరంగా. అల్లు అర్జున్ - హ‌రీష్ శంక‌ర్ - దిల్‌రాజు కాంబినేష‌న్‌లో డీజే సినిమా ఇటీవ‌లే ప‌ట్టాలెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజ‌ల్‌ని ఎంచుకొన్నార్ట‌. ఇది వ‌ర‌కు బ‌న్నీకి వీర ఫ్లాప్ ఇచ్చిన కాజ‌ల్‌.. ఈసారైనా హిట్టిస్తుందేమో చూడాలి.