English | Telugu
దిల్‌రాజును కొట్టే మగాడు ఇతనేనా..?
Updated : Sep 7, 2016
దిల్‌రాజు డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా టాలీవుడ్‌లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాలను పక్కనబెడితే నైజాం ఏరియాలో సినిమాను శాసించే వ్యక్తి. తెలుగు సినిమా అయినా డబ్బింగ్ సినిమా అయినా దిల్‌రాజు పంపిణీ చేయాల్సిందే..లేదంటే ఆ సినిమా బతకడం కష్టం. అలాంటి వ్యక్తికి అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా గట్టి పోటీ ఇస్తున్నారు. నైజాం ఏరియాలో శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, కబాలి వంటి పెద్ద సినిమా హక్కుల్ని సోంతం చేసుకుని అభి పంపిణీ చేశాడు. వీరిద్దరి మధ్య పోటీ ఎక్కువకావడంతో దిల్‌రాజు కంటే ఎక్కువ ఆఫర్ ఇచ్చి మరి సినిమా హక్కుల్ని సొంతం చేసుకుంటున్నాడు అభి. దీంతో ఇన్నాళ్లుగా తెలుగు సినిమాకు నైజాం ఏరియాలో కింగ్‌మేకర్‌లా వ్యవహరిస్తున్న దిల్‌రాజును కొట్టే మగాడు వచ్చాడని ఫిల్మ్‌నగర్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా అపార అనుభవం, ఇండస్ట్రీలో పరిచయాలు, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అన్ని పుష్కళంగా ఉన్న దిల్‌రాజును ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు. తన దారికి అడ్డొస్తున్న అభిషేక్ పిక్చర్స్‌ను రాజు ఎదిరించలేకపోవడానికి కారణం అభిషేక్ వెనుక ఉన్న ఓ వ్యక్తి అండదండలే. తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న మంత్రిగారి భార్య ఒకరు అభికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారట. ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ ఉండటం వల్ల దిల్‌రాజు ఏం చేయలేకపోతున్నాడట.