Read more!

English | Telugu

చివరికి ఆ క్యారెక్టర్ చేస్తోందట

 


జోష్ చిత్రంతో  తెలుగు ప్రేక్షలకు పరిచయమైన తార కార్తీక. నిన్నటి తరం నటి రాధ కూతురు అయిన కార్తీక తర్వాత   దమ్ము, రంగం చిత్రాలలో కూడా నటించింది. దమ్ము చిత్రం తర్వాత ఈ అమ్మడు తెలుగులో అసలు కనిపించడమే లేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ఫిలిం నగర్ లో కార్తీక పేరు వినిపిస్తోంది. అదీ మామూలుగా కాదు. హీరోయిన్ రేంజ్ నుంచి కార్తిక చెల్లి పాత్రలకు  తన రేంజ్ ని మార్చినట్లు తెలుస్తోంది. చిన్ని కృష్ణ దర్శకత్వంలో, అమ్మిరాజు  నిర్మిస్తున్న చిత్రంలో ఈ హీరోయిన్ చెల్లెలి పాత్రలో కనిపించనుందట.


అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కార్తీక సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది. చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో   ఛాన్స్  వచ్చిందని కాబోలు, క్యారెక్టర్ ఏదైనా చేసేద్దాం అని కార్తిక డిసైడ్ అయి వుంటుంది.