English | Telugu

హరీష్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!!

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ మూవీ తర్వాత విజయ్.. హరీష్ శంకర్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి 'లైగర్' తరువాత విజయ్.. దర్శకుడు సుకుమార్ తో సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సుకుమార్ 'పుష్ప' మూవీతో బిజీగా ఉండటంతో.. ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడానికి సమయం పట్టేలా ఉంది. దీంతో విజయ్.. హరీష్ శంకర్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో విజయ్ ఒక సినిమా కమిట్ అయ్యి ఉన్నాడని.. దానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

కాగా, హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నారు. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.