English | Telugu

పవన్-రానా సినిమాకు పవర్‌ ఫుల్ టైటిల్!!

మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

'అయ్యప్పనుమ్ కోషియం' తెలుగు రీమేక్ కు 'పరశురామ కృష్ణమూర్తి' అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. మలయాళంలో ఈ రెండు పాత్రల పేర్లను కలిపే 'అయ్యప్పనుమ్ కోషియం' టైటిల్ పెట్టారు. అదే పద్ధతిని తెలుగులోను ఫాలో అవుతున్నారట. సినిమాలో పవన్- రానాల పాత్రల పేర్లు కలిపి 'పరశురామ కృష్ణమూర్తి' అనే టైటిల్ ను సెట్ చేయాలనుకుంటున్నారట.

సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించనున్నారు.