English | Telugu
ఇండ్రస్ట్రీ హిట్ రావాలంటే నరుక్కోవాలా?
Updated : Sep 23, 2015
యాక్షన్ పేరుతో హింస ఎంత ఎక్కువగా చూపిస్తే ఆ సినిమా అంత పెద్ద హిట్టవుతుందా?? రొటీన్ సినిమాలే పరిశ్రమకు శ్రీరామ రాక్షా..?? హరీష్ శంకర్ అదే అంటున్నాడు. హీరో కత్తి పట్టి.. వంద మందిని ఒక్కడే నరికితే గానీ, ఇండ్రస్ట్రీ హిట్ రాలేదు కదా.. అలాంటప్పుడు ఆ ఫార్ములాలో సినిమాలు తీసుకొంటూ వెళితే తప్పేముంది? అంటున్నాడు హరీష్. ఆయన అన్నది మగధీర సినిమా గురించే అన్నది అర్థమవుతూనే ఉంది.
ప్రయోగాలు పేరుతో కొత్త కొత్త సినిమాలు తీస్తే... ఫలితం ఏమవుతుందో తనకు షాక్ సినిమా ద్వారా అర్థమైందంటున్నాడు. ఆ సినిమా ఫ్లాప్ తో నాలుగేళ్లు ఇంట్లోపనిలేకుండా కూర్చున్నా అని తనపై తనే సెటైరేసుకొన్నాడు. ప్రేక్షకులు కోరుకొన్న సినిమాలు తీయడంలో తప్పేం లేదని, ఇప్పటి దర్శకుడికి ఉండాల్సిన క్వాటిలీ అదే అని. ఓ మంచి మాట చెప్పడానికి నిర్మాత జేబులోని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటున్నాడు హరీష్.
అంతా బాగానే ఉందిగానీ.. వంద మందిని నరకడం వల్లే మగధీర హిట్టయింది అనుకోవడం హరీష్ అమాయకత్వం. విజువల్ ఎఫెక్ట్స్ రేంజు చూపించిన సినిమా అది. కథ, కథనాలలో బలముంది. దానికి తోడు రాజమౌళి మ్యాజిక్ ఉంది. ఇవన్నీ వదిలేసి వంద మంది గురించే మాట్లాడడం హరీష్ అమాయకత్వమేగా.