English | Telugu

'రుద్రమదేవి' కొత్త చరిత్ర సృష్టిస్తుందా?

అనుష్క ప్రధానపాత్రలో భారీ చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’ ఎట్టకేలకు అక్టోబరు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చేశారు. వాయిదాలు మీద వాయిదాలు పడి పడి అక్టోబరు 9న ఖాయమంటున్న 'రుద్రమదేవి' ఆ రోజైన వస్తుందా? రాదా? అన్న డౌట్ ప్రేక్షకుల్లో కొనసాగుతుంది.

ఐతే ‘రుద్రమదేవి’ సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే సినిమా సూపరట. చాలా మంచి రిపోర్ట్ ఉందంటూ నిర్మాత - పీఆర్వో బీఏ రాజు ట్వీట్ చేశారు. ఇంకొంతమంది కూడా సెన్సార్ రిపోర్ట్ బావుందని అంటున్నారు. అయితే ఇప్పటికి వరకు టాలీవుడ్ ఇన్ని వాయిదాలు పడి రిలీజైన సినిమాలు హిట్ అయినట్టు చరిత్రే లేదు.

మరి రూ.70 కోట్ల బడ్జెట్ తో రూపొందిన రుద్రమదేవి టాలీవుడ్ లో కొత్త చరిత్ర సృష్టిస్తుందా? బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.